– ఎమ్మెల్యే జారె ను వేడుకున్న వలస గిరిజనులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
గత 30 సంవత్సరాలుగా పోడు భూములు సాగు చేసుకుంటూ జీవిస్తున్న ఆదివాసీలను ఆ భూముల నుండి గెంటివేసే ప్రయత్నాలను విరమింప చేయాలని, మౌళిక వసతులు కల్పించి, పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని,మా జీవితాలను ఆగం కాకుండా కాపాడాలని వలస గిరిజనులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ను వేడుకున్నారు.
మండలంలోని మద్దులమడ పంచాయతీ పరిధిలోని ఉడుముల బండ,రాళ్లవాగు,మద్యగుంపు వలస గిరిజనులు,ఆదివాసి గిరిజనులు సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యపై స్థానిక ఎమ్మెల్యే జారి ఆదినారాయణను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “మీకు వచ్చిన భయం ఏమీ లేదని నేను పై అధికారులతో మాట్లాడి మీకు తగిన న్యాయం చేస్తానని” వారికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ మాస్ లైను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోకినెపల్లిప్రభాకర్, అమర్లపూడి రాము,పీవైఎల్ మండల కార్యదర్శి కుంజ అర్జున్ రావు, స్థానిక నాయకులు కనితి మల్లేష్, కణితిసీతారాములు, కనితి భీమయ్య, కనితి వీరయ్య,నరేష్, ఆడమయ్య, నందా తదితరులు పాల్గొన్నారు.


