కళ్యాణ లక్ష్మి పథకం పేదలకు ఓ వరం.. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – బాన్సువాడ, నసురుల్లాబాద్
నా జీవం ఉన్నంత వరకు బాన్సువాడ నియోజకవర్గం ప్రజలకు సేవ చేస్తానని, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శం అని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలో నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ బీర్కూర్ బాన్సువాడ మండలాల్లో ఉన్న కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రజాసేవయే నా ఆశయమన్నారు.
ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ నిరుపేద బతుకుల్లో వెలుగు నింపడమే నా ఆశయమన్నారు. నా ప్రాణం ఉన్నంతవరకు ప్రజలే దేవుళ్ళుగా భావించి ప్రతినిత్యం ఏ కష్టం వచ్చినా నా కుటుంబ సభ్యులుగా భావించి సేవలు అందించడమే నా ఆశయం అంటూ ఆయన అన్నారు. శాసనసభాపతి అయిన బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నా విధి నిర్వహణలో ప్రజలతో మమేకమై వారి కష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమస్యలు ఎప్పటికప్పుడు తీర్చేందుకు కృషి చేస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సువర్ణ, ఆర్ ఐ స్వామి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి ఫోరం కన్వీనర్ కంది మల్లేష్, మాజీ ఉప సర్పంచ్ ఖలీల్, ఫయాజ్, బానుగౌడ్, చుంచు సాయిలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.



