నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని తాజ్ పూర్ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డు లు ఆన్లైన్ లో నమోదు చేసుకోవడానికి హెచ్ ఇ ఎస్ పి ఎల్, డిబి ఎస్ 2.0 వారి సౌజన్యం తో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమం దాదాపు 4రోజుల పాటు కొనసాగుతుందని, 60సం.. లోపు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంతో విలువైన ఈ ఆరోగ్య బీమా కార్డులను ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో సామాజిక వేత్త డా, ర్యాకల శ్రీనివాస్ , వార్డు సభ్యులు పల్లెపాటి క్రిష్ణ, బొమ్మారపు రామక్రిష్ణ, బీట్కూరి మహేష్, వరిగంటి మానస నాగరాజు,షేక్ అహ్మద్, గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు, పాల్గొన్నారు.
ఆయుష్మాన్ భారత్ హెల్త్ నమోదుకు ఆన్లైన్ ఏర్పాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



