నవతెలంగాణ-కోహెడ
మండలంలో పెయింటర్స్ అసోసియేషన్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా జేఏసీ పెయింటింగ్ అసోసియేషన్ చైర్మన్ చాడ ఆనంద్, అధ్యక్షుడు ప్రభాకర్ అన్నారు. మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామంలో మహాలక్ష్మి పెయింటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో సభ్యులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. పెయింటింగ్ వృత్తిలో ఉన్న కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఉపాధి అవకాశాల లోపం, పెరుగుతున్న ఖర్చులు వంటి పలు అంశాలపై సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సభ్యుల సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొడముంజ సుదర్శన్, చిట్యాల మహేష్ బాబు, పొన్నాల ప్రసాద్, టీ. మహేష్ తదితరులు పాల్గొన్నారు.
పెయింటర్స్ సమస్యలను పరిష్కరిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



