Monday, March 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅమ్మాయిలకు ధైర్యం ఇచ్చే సినిమా

అమ్మాయిలకు ధైర్యం ఇచ్చే సినిమా

- Advertisement -

భిన్న పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్‌ కుమార్‌ స్వీయ దర్శకత్వంలో తన సోదరి పూజా శరత్‌ కుమార్‌తో కలిసి దోస డైరీస్‌ బ్యానర్‌ పై నిర్మిస్తున్న చిత్రం ‘సరస్వతి’. హై-కాన్సెప్ట్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈనెల 6న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ గ్రాండ్‌గా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. హీరోయిన్‌, డైరెక్టర్‌ వరలక్ష్మి శరత్‌ కుమార్‌ మాట్లాడుతూ,’తమన్‌ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. మా నటీనటులు లేకపోతే సినిమా ఇంత అద్భుతంగా వచ్చేది .ప్రకాష్‌ రాజ్‌, ప్రియమణి నా విజన్‌ని మరో స్థాయికి తీసుకువెళ్లారు. తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఇందులో ప్రతి పాత్ర కూడా చాలా అర్థవంతంగా ఉంటుంది. మా సినిమాకి వెన్నుముకగా నిలిచిన ఈటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఈ సినిమాతో మా నాన్నని గర్వపడేలా చేస్తానని నమ్ముతున్నాను. స్త్రీలని గౌరవించడం మనందరి కర్తవ్యం. అలాంటి మంచి సందేశం ఉన్న సినిమా ఇది.

సోషల్‌ మెసేజ్‌తో పాటు ఎంగేజింగ్‌గా, ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. ఫస్ట్‌ టైం చూసినవారు ట్విస్ట్‌లను రివీల్‌ చేయకూడదని కోరుతున్నాను’ అని అన్నారు. ”సరస్వతి’ లాంటి కథ ఖచ్చితంగా చెప్పాలి. ఇందులో కొన్ని క్లిప్స్‌ చూశాను. ప్రేక్షకులు చాలా మంచి తీర్పు ఇస్తారని నమ్ముతున్నాను’ అని హీరో శరత్‌ కుమార్‌ చెప్పారు. ”సరస్వతి’ ధైర్యాన్ని ఇచ్చే సినిమా. వరలక్ష్మి ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. తను చేస్తున్న ఫస్ట్‌ సినిమా చూసినప్పుడే తప్పకుండా ఒక మంచి నటి అవుతుందని భావించాం. మా నమ్మకం నిజమైంది. ఇలాంటి కథ చాలా అరుదుగా వస్తుంది. ఇలాంటి కథ చెప్పడానికి ధైర్యం కావాలి. ఇది మౌనంగా ఉన్న చాలా మంది అమ్మాయిలకి ఒక ధైర్యాన్నిస్తుంది. వరలక్ష్మి చేసిన ఈ సినిమా చూస్తుంటే గర్వంగా ఉంది’ అని రాధిక శరత్‌ కుమార్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -