Monday, March 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగాదె శ్రీనివాస్‌రెడ్డి త్యాగం మార్గదర్శనం

గాదె శ్రీనివాస్‌రెడ్డి త్యాగం మార్గదర్శనం

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్‌

ప్రజల హక్కుల కోసం నిరంతర పోరాటమే మార్గమంటూ ఆదర్శంగా నిలిచిన శ్రీనివాస్‌రెడ్డి త్యాగం ఆదర్శనీయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి సభ్యులు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాల గూడలో గాదె శ్రీనివాస్‌రెడ్డి 44వ వర్ధంతి సంద ర్భంగా ఆయన స్థూపం వరకు ర్యాలీ నిర్వహిం చారు. శ్రీనివాస్‌రెడ్డి విగ్రహానికి పూల మాలలేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో జూలకంటి మాట్లాడారు. పేదలకు భూమి పంచాలనే న్యాయమైన డిమాండ్‌తో జరిగిన పోరాటాల్లో కాంగ్రెస్‌ గూండాల చేతిలో ప్రాణ త్యాగంచేసిన వ్యక్తి గాదె శ్రీనివాసరెడ్డి అని గర్తు చేశారు. ఆయన త్యాగస్ఫూర్తిని స్మరించు కుంటూ, ఆయన చూపిన పోరాటమార్గంలో ముందుకు సాగాలన్నారు. భూమి హక్కులు, కార్మిక, రైౖతుల హక్కుల సంక్షేమం కోసం సాగిన ఉద్యమాలు ప్రజాచరిత్రలో ప్రత్యేకస్థానం సంపాదించాయని, అటువంటి పోరాటస్ఫూర్తి మార్గాన్ని మనకు చూపించిన శీనన్న నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. మిర్యాలగూడలో సీపీఐ(ఎం) నిర్మాణా న్ని మరింత బలోపేతం చేసి, గ్రామస్థాయి నుంచి పట్టణస్థాయి వరకు ప్రజలెదు ర్కొంటున్న సమస్య లపై రాజీలేని పోరాటాలు నిర్వహించారన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, పేదవారు నివసి స్తున్న ఇండ్లపై, భూ ములపై అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు చేస్తున్న దాడుల వంటి సమస్యలపై ప్రజలను చైతన్య పరిచి, ఐక్యతతో ఉద్యమాలను చేపట్టాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేషం, గాదె శీనన్న సతీమణి, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకురాలు పద్మమ్మ, కుమారుడు ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ(ఎం) వన్‌ టౌన్‌, టూటౌన్‌ కార్యదర్శులు మల్లు గౌతంరెడ్డి, భావండ్ల పాండు, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రవినాయక్‌, రాగిరెడ్డి మంగా రెడ్డి, రెమడాల పరుశరాములు, రొండి శ్రీను, చౌగాని సీతారాములు, పోలేబోయిన వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -