Monday, March 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగిరిజన బిడ్డల ఆరోగ్యంపై రాజీపడం

గిరిజన బిడ్డల ఆరోగ్యంపై రాజీపడం

- Advertisement -

– రూ.10.70 కోట్లతో చర్ల సీహెచ్‌సీ అప్‌గ్రేడేషన్‌
– 30 పడకల ఆస్పత్రి భూమిపూజలో మంత్రి పొంగులేటి
నవతెలంగాణ-చర్ల

మారుమూల గ్రామాల ప్రజలు వైద్యం కోసం పట్టణాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా చర్ల హెల్త్‌ సెంటర్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ)ను రూ. 10.70 కోట్ల వ్యయంతో 30 పడకల అత్యాధునిక వైద్యశాల తీర్చిదిద్దే పనులకు మంత్రి పొంగులేటి ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంత గిరిజన బిడ్డలకు మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. రాష్ట్రంలో వైద్య సేవలకు మంచి పేరుందని, వైద్య ఉద్యోగులకు ఏవైనా సమస్యలుంటే కలెక్టర్‌ ద్వారా తన దృష్టికి తీసుకువస్తే.. వాటిని పరిష్కరించి గిరిజనులకు మరింత మెరుగైన సేవలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆస్పత్రిలోని గిరిజన రోగులను మంత్రి పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్స, మందుల సరఫరా గురించి ఆరా తీశారు. మీకు తోడుగా ప్రభుత్వం ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రోగులకు భరోసా కల్పించారు.

అనంతరం పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లను భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుతో కలిసి మంత్రి సత్కరించారు. చర్లకు చెందిన 18 మంది గ్రామ పంచాయతీ సర్పంచులకు, దుమ్ముగూడెంకు చెందిన 17 మంది సర్పంచులకు భద్రాచలానికి చెందిన సర్పంచ్‌, ఉప సర్పంచ్‌కు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పట్టు వస్త్రాలతో పాటు షీల్డ్‌ ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో మహబూబాబాద్‌ ఎంపీ పోరిక బలరాం నాయక్‌, టీపీసీసీ కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్‌, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్‌ అంకిత్‌, ఐటీడీఏ పీఓ బి. రాహుల్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు చీమలమర్రి మురళీకృష్ణ, సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -