Monday, March 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమూసీ సుందరీకరణ చేయండి

మూసీ సుందరీకరణ చేయండి

- Advertisement -

– ఇండ్లను ధ్వంసం చేయొద్దు
– ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వమే అనుమతిచ్చింది : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌
– గంధంగూడ నుంచి మధుపార్క్‌ వరకు మూసీ బాధితులకు అండగా పాదయాత్ర
నవతెలంగాణ-గండిపేట్‌

మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను ధ్వంసం చేయొద్దని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ సర్కిల్‌లోని హైదర్షాకోట్‌ గంధం గూడ, కేకే నగర్‌-2, విగేశ్వర్‌ నగర్‌ కాలనీ నుంచి మధు పార్క్‌ వరకు మూసీ సుందరీకరణలో భాగంగా ఇండ్లను కోల్పోతున్న బాధితు లతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో బాధితులతో మాట్లా డుతూ వారి సమస్యలను విన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ మూసీ సుందరీకరణ ముఖ్యమే కానీ ఇండ్లను ధ్వంసం చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. 20 ఏండ్ల క్రితం నిర్మించుకున్న ఇండ్లను కూల్చి వేయడం తగదన్నారు. ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ప్రభుత్వమే ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వానికి ఇంటి పన్ను, విద్యుత్‌ బిల్లులు, నీటి బిల్లులు చెల్లిస్తు న్నారని తెలిపారు. నిర్మించుకున్న ఇండ్లపైన ఈఐఎంలు, అప్పులు ఉన్నాయ న్నారు. అభివృద్ధి చేయాలే గానీ విధ్వంసం చేయొద్దని తెలిపారు. సుందరీకరణ పేరుతో వేలకోట్ల రూపాయలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రూ.16వేల కోట్లతో సుందరీకరణ చేయొచ్చని డీపీఆర్‌ ప్రజెంటేషన్‌ చేశామ న్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దగ్గర ఇలాంటి డీపీఆర్‌ లేదా అని ప్రశ్నించారు. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, శాసనమండలి మాజీ చైర్మెన్‌ స్వామిగౌడ్‌, బీఆర్‌ఎస్‌ నియోజవర్గ ఇన్‌చార్జి పి.కార్తీక్‌రెడ్డి, బండ్లగూడ, నార్సింగి అధ్యక్షులు నాగరాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు ప్రేమ్‌గౌడ్‌, మందా రవీందర్‌రెడ్డి, ముక్తార్‌ పాషా, విష్ణువర్ధన్‌, మహిళలు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మా ఇండ్లను కూల్చొద్దని సీఎంకు చెప్పండి : చిన్నారి
మూసీ సుందరీకరణ పేరుతో మా ఇండ్లను కూల్చొద్దని, సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పాలని, కావాలంటే నా కిడ్డీ బ్యాంకు, బొమ్మ తీసుకోవాలని ఓ చిన్నారి ఏడ్చుకుంటూ ఇండ్ల బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన కేటీఆర్‌ను కోరాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -