– మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క
– ములుగు జిల్లాలో పర్యటన
నవతెలంగాణ-ములుగు/మంగపేట
మల్లూరు దేవాలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి చేరుకున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తదితరులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో, డోలు వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మల్లూరు గుట్టలోని హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ములుగు ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రాలు నెలవై ఉన్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి, ప్రజా ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా మేడారం జాతరను అద్భుతంగా నిర్వహించామని తెలిపారు. మేడారం దేవాలయం పనులు 200ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని దేవాలయాలను బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, వాటికి సంబంధించిన పనులు కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సీహెచ్ మహేందర్ జీ, మార్కెట్ కమిటీ చైర్మెన్ రేగ కళ్యాణి, ఈఓ మహేష్, ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మెన్ సురేష్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మల్లూరు ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



