Saturday, July 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీల విద్య అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి

అంగన్వాడీల విద్య అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : అంగన్వాడీల విద్య అభివృద్ధికి ప్రజా పాలన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని డోంగ్లి మండలంలోని మోగా గ్రామ సర్పంచ్ హాలి బస్వంత్ తెలిపారు. గ్రామంలోని అంగన్వాడి చిన్నారులకు ప్రభుత్వం ద్వారా అందించే దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని తెలిపారు. చిన్నారులకు గర్భవతులకు బాలింతలకు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందించడం శుభపరిమానమని ఆయన పేర్కొన్నారు. అంగన్వాడీల్లో చిన్నారులకు బాలింతలకు గర్భిణీలకు పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించాలని అంగన్వాడి టీచర్లకు కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు, చిన్నారుల తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -