- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ గ్రామ సర్పంచ్ గా రెండు పర్యాయాలు పనిచేసిన మాజీ సర్పంచ్ రౌతువార్ వేద్ ప్రకాష్ పటేల్ ఈనెల రెండు నా మృతి చెందగా ఆయన అంత్యక్రియలు శనివారం నాడు నిర్వహించారు. మాజీ సర్పంచ్ అంత్యక్రియలకు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే, మాజీ ఎమ్మెల్యే అరుణతార, నిజామాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు హాజరై మృతుని శవంపై పుష్పగుచ్చలు పెట్టి నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మృతుని కుమారులని ఓదార్చారు. అంత్యక్రియలు బంధుమిత్రులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
- Advertisement -



