Monday, March 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయిల్‌ సైనిక దాడిని ఖండించండి

ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయిల్‌ సైనిక దాడిని ఖండించండి

- Advertisement -

సామ్రాజ్య వాద అనుకూల వైఖరి మన దేశ సార్వభౌమత్వానికి ప్రమాదం : ఎంసీపీఐ(యు)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఇరాన్‌ను కట్టడి చేసే పేరుతో ఇజ్రాయిల్‌ను ముందుంచి అమెరికా సాగిస్తున్న సైనిక దాడులను ఎంసీపీఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్‌ ఓంకార్‌, రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఖండించారు. ఈ మేరకు ఆదివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఖమేనీపై దాడి చేసి హత్యచేయడం అభివృద్ధి చెందుతున్న దేశాలకు అమెరికా హెచ్చరిక అనీ, సహజ వనరులపై ఆధిపత్యం కోసం అమెరికా అన్ని దేశాలపైనా దాడులు చేసుకుంటూ పోతున్నదని విమర్శించారు.

ప్రపంచ న్యాయ సూత్రాలను, ధిక్కరించి ఇతర దేశాల సార్వభౌమత్వంలో జోక్యం చేసుకుని సాగిస్తున్న ఈ దాడులు రానున్న కాలంలో మానవ మనుగడకు పెనుముప్పుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు ఉన్మాదంతో సాగిస్తున్న ఈ సైనిక దాడులను యావత్‌ ప్రపంచంలోని అభ్యుదయ, ప్రజాతంత్ర, ప్రగతిశీల శక్తులు తీవ్రంగా ఖండించాలనీ, ప్రజాఉద్యమాలను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -