- Advertisement -
టీపీటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
టీచర్ల వేతనాలపై విద్యా కమిషన్ సిఫారసులు సరికాదని టీపీటీఎఫ్ ఖండించింది. ఈ మేరకు టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయివేటు విద్యావ్యవస్థ రద్దుకు సిఫారసు చేయకపోవడం పట్ల వారు విచారం వ్యక్తం చేశారు. కమిషన్ సిఫారసులపై ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చించాలని డిమాండ్ చేశారు. కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కొన్ని అంశాలు ఆశాజనకంగా, ఆహ్వనించదగినవిగా ఉంటే చాలా అంశాలు నిరాశపరచటమే కాక ఆక్షేపణీయాంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.
- Advertisement -



