బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కరీంనగర్ సీపీ గౌస్ ఆలం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీపీకి కేటాయించిన ప్రభుత్వ వాహనాన్ని ప్రవేయిట్ వ్యక్తులు ఉపయోగిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉంటున్న సీపీ మిత్రుడయిన ఐఆర్ఎస్ అధికారి వికాస్ అగర్వాల్ తండ్రి కోసం తనకు కేటాయించిన ప్రభుత్వ వాహనం(టీఎస్ 09 పీఏ-4195) వినియోగుస్తున్నారని ఆరోపించారు.
కరీంనగర్ వన్ టౌన్లో పని చేస్తున్న కానిస్టేబుళ్లు అశోక్, అనిల్ డ్రైవర్లగా ఉన్నారని చెప్పారు. తన సోదరుడు సైతం సర్కార్ వాహనంలో కాలేజికి వెళుతున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న పీడీఎస్ బియ్యం అక్రమాల వెనక సీపీ ఉన్నారని ఆరోపించారు. హోంగార్డ్స్ బదిలీల్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయని విమర్శించారు. వెంటనే కరీంనగర్ సీపీపై విచారణణ చేసి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీపీ చేసిన అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి సంబంధించిన వీడియోలన్ని బహిర్గతం చేస్తానని హెచ్చరించారు.
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కరీంనగర్ సీపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



