Monday, March 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపశ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌లు..తెలంగాణవాసుల‌కు హెల్ప్ లైన్

పశ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌లు..తెలంగాణవాసుల‌కు హెల్ప్ లైన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పశ్చిమాసియా లో ఉద్రిక్త‌త‌ల‌ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న తెలంగాణ వాసుల భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేరకు బాధితులకు, కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఓ ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారు లేదా వారి కుటుంబ సభ్యులు ల్యాండ్‌లైన్ నెంబర్ 011-23380556‌కు అధికారులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్, లైజన్ హెడ్ వందర బరువా +91 98719 99044, లైజన్ ఆఫీసర్ జి.రక్షిత్ నాయక్ +91 96437 23157, పీఆర్వో సీహెచ్ చక్రవర్తి +91 99493 51270 నెంబర్లలో అందుబాటులో ఉండనున్నారు. విమాన సర్వీసుల రద్దు కారణంగా విమానాశ్రయాల్లో చిక్కుకున్న ప్రయాణికుల వివరాలను సేకరించి, వారికి వసతి, ప్రయాణ సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. తెలంగాణ వాసులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎంవో వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -