Monday, March 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు గుర్తింపు కార్డు కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

రైతు గుర్తింపు కార్డు కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

- Advertisement -

ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలి బర్రె పూజిత- జహంగీర్
నవతెలంగాణ – భువనగిరి

ఏఈఓ సహాకారంతో 23వ వార్డులో ఉచితంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేసిన కౌన్సిలర్ బర్రె పూజిత – జహంగీర్ భువనగిరి మున్సిపల్ పట్టణంలోని 23వ వార్డులో పట్టాదార్‌ పాసు పుస్తకం కలిగిన రైతులు తప్పసరిగా ‘రైతు గుర్తింపు కార్డు’ కోసం వార్డులో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ఉచితంగా దరఖాస్తులు చేసుకోవాలని 23వ వార్డు కౌన్సిలర్ బర్రె పూజిత జహంగీర్ తెలిపారు. అన్‌లైన్‌ దరఖాస్తుకు సోమవారం మార్చి 02వ తేది నుండి ఏఈఓ వెంకటరావు అధ్వర్యంలో ఫ్రీగా ఏర్పాటు చేసినట్లు ఆ వెల్లడించారు.

ఈ రిజిస్ట్రేషన్ గుర్తింపు వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు చేసే మేలు కార్యక్రమాలకు ఉపయోగపడే ఆధార్ లింక్ రైతు రిజిస్ట్రేషన్ కార్డు వల్ల ప్రభుత్వము వివిధ రకాల వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ రైతులకు రుణాలు గాని ఇతరత రైతు ప్రయోజనాలకు ఉపయోగపడే అన్ని పథకాలకు ఉపయోగపడే రైతు గుర్తింపు కార్డును ప్రైవేటు ఆన్లైన్ సెంటర్లకు వెళ్లకుండా ఉచితంగా మీ దగ్గరికి వ్యవసాయ అధికారులు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న సదుపాయానికి మీరంతా ఉపయోగించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

పట్టాదార్‌ పాసు పుస్తకం,ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలతో పాటు ఆధార్‌కు అనుసంధానించిన మొబైల్ నంబర్‌ను వార్డులో ఏర్పాటు చేసిన ఆన్లైన్ సెంటర్‌కు వెళ్ళి రైతు నమోదు పక్రియను పూర్తి చేసుకోవాలని రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్న ఏఈఓ సలహాలు సూచనలు తీసుకోవాలని సూచించారు. పీఎం కిసాన్‌ నగదు పైకం జమ కావడానికి, ఇతర ప్రభుత్వ పథకాల వర్తింపు కోసం రైతు గుర్తింపు కార్డు అవసరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతు నాయకులు కర్కాల పోచయ్య, పోకల నాగరాజు,దర్గాయి భాస్కర్,భూషపాక యాదగిరి,పెంబర్తి రాజు వార్డ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూషపాక ఈశ్వర్ బాబు,ఐలపురం బాబు, బర్రె నరేందర్, భూషపాక మల్లేష్, బర్రె క్రాంతి, కర్కాల రమేష్,బండారు శివకుమార్  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -