ఎర్రబెల్లి దిలీప్ రావు సొంత నిధులతో ఆంజనేయ స్వామికి విరాళం
పడమటి గడ్డ తండా వాసులు
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని మేచరాజుపల్లి గ్రామ శివారు పడమటి గడ్డ తండా అభివృద్ధికి తన సొంత డబ్బులు హెచ్చించి దాతగా ముందుకు వచ్చిన ఎర్రబెల్లి దిలీప్ రావు కి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమాన్ని పడమటి గడ్డ తండావాసులు నిర్వహించినట్లు ఆ గ్రామస్తుడు గుగులోతు భాస్కర్ నాయక్ తెలిపారు. సోమవారం గ్రామస్తులతో కలిసి అభివృద్ధి ప్రదాత ఎర్రబెల్లి దిలీప్ రావు కి స్వాగతం పలికి శాలువతో ఘనంగా సత్కరించే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా పడమటి గడ్డ తండకు చెందిన రోడ్డు విషయంలో గత ప్రభుత్వం సాంక్షన్ చేసిన రోడ్డును దిలీప్ రావు గారు ముందుండి తారు రోడ్డు వేయించడం జరిగింది అని అన్నారు. అదే తండాకు చెందిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో తనవంతుగా ఆర్థిక సాయం చేయడం తో పాటు మా తండా ప్రజలకు ఏమి కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా మా వెంట ఉండి ఆదుకునే ఎర్రబెల్లి దిలీప్ రావు కి మా తండావాసులు రుణపడి ఉంటామని అన్నారు. మా తండా అభివృద్ధికి వారి సొంత డబ్బులు హెచ్చించి ముందుకు వచ్చినందుకు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు అన్నారు. ఈ తండా అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎర్రబెల్లి దిలీప్ రావు కి వారి కుటుంబానికి మా తండా వాసులు ఎల్లవేళలా రుణపడి ఉండి ఉంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు గుగులోతు స్రవంతి భాస్కర్ నాయక్, గుగులోతు మోహన్ నాయక్, జక్కుల యాకన్న, రేవంత్ కుమార్, చక్రు, డేగల కుమార్ స్వామి, శ్రీను, శంకర్, గణేష్, రాందన్ ,కిమ్యా ,భరత్ తండ వాసులు పాల్గొన్నారు.



