Monday, March 2, 2026
E-PAPER
Homeఖమ్మంముప్పై ఏళ్ల కల నెరవేరిన వేళ

ముప్పై ఏళ్ల కల నెరవేరిన వేళ

- Advertisement -

– స్పందించిన సర్పంచ్ పండు రెడ్డి
– సహకరించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
– పెద్ద మిద్దె వలస గిరిజనులకు మంచినీటి సౌకర్యం
నవతెలంగాణ – అశ్వారావుపేట 

సౌకర్యాలు సమృద్ధిగా ఉన్న నేటి సమాజంలో గడియ పాటు విద్యుత్ నిలిచినా, కొద్ది సేపు నల్లా నీళ్లు రాకపోతే నే ఎంతో అసంత్రుప్తి భావిస్తున్న తరుణంలో… ముప్పై ఏళ్లుగా ప్రాథమిక సౌకర్యాలకే దూరంగా, వాగులు–వంకల నీళ్లపై ఆధారపడి జీవిస్తున్న దట్టమైన అటవీ ప్రాంత నివాసుల జీవనం ఎంత కష్టసాధ్యమో ఊహించుకోవచ్చు.

మండల పరిధిలోని మొద్దులమడ పంచాయితీకి చెందిన పెద్ద మిద్దె గ్రామం నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో అటవీ మధ్య నివసిస్తున్న వలస గిరిజనులు మూడు దశాబ్దాలుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో వాగుల నీరే ఆధారం కాగా, ఎండాకాలంలో పరిస్థితి మరింత దయనీయంగా మారేది.

ఈ నేపథ్యంలో స్థానిక సర్పంచ్ పండు రెడ్డి స్పందించి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సహకారంతో సోమవారం బోర్‌వెల్ నిర్మాణ పనులు ప్రారంభించారు. గ్రామ ప్రజల దీర్ఘకాల కల నెరవేరుతున్న ఈ వేళ గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

“ఇప్పటివరకు తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చేది. ఇక నుంచి ఆ బాధ తప్పనుంది” అని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యతో పెద్ద మిద్దె వలస గిరిజనులకు శాశ్వత మంచినీటి సౌకర్యం అందుబాటులోకి రానుండటం గ్రామ అభివృద్ధికి నూతన దశగా నిలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -