– ఈ నెల 16,17 తేదీల్లో ప్రత్యేక సమావేశాలు
– అశ్వారావుపేట మున్సిపాలిటీ కి ఇద్దరి కే అవకాశం
– వెళ్ళడించిన కమీషనర్ నాగరాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ ల్లో కో – ఆప్షన్ సభ్యులు నియామకానికి విధి విధానాలను ప్రకటించింది. ఈ నెల 16,17 తేదీ ల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సర్కులర్ విశేషాలు ను కమీషనర్ నాగరాజు సోమవారం ప్రకటించారు. ముస్లిం,క్రిష్టియన్, బుద్ధిస్ట్,జొరాస్ట్రియన్, సిక్కు సామాజిక వర్గం వ్యక్తుల నుండి ఎంపిక చేయాల్సి ఉంటుంది.
అశ్వారావుపేట మున్సిపాలిటీ కి ఇద్దరి కే అవకాశం ఉందని,ముస్లిం,క్రిష్టియన్, బుద్ధిస్ట్,జొరాస్ట్రియన్, సిక్కు సామాజిక వర్గాల్లో అశ్వారావుపేట లో బుద్ధిస్ట్,జొరాస్ట్రియన్, సిక్కు సామాజిక వర్గాలు లేనందున ముస్లిం, క్రిష్టియన్ సామాజిక వర్గం ఒక్కొక్కరికి అవకాశం ఉందని ఈ ఇరువురు లోనూ ఒకరు మహిళ కు అవకాశం ఇవ్వాలని తెలిపారు.
అయితే మొదటి సారి మున్సిపాలిటీ కావడంతో ఎంతో మంది కో – ఆప్షన్ సభ్యులు గా ఎంపిక కావడం కోసం ఎన్నో కలలు కన్నారు.కానీ వారి కలలు ఫలించే అవకాశం లేకుండా పోయింది.



