Monday, March 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధన్వాడలో ఘనంగా శ్రీపాదరావు జయంతి వేడుకలు

ధన్వాడలో ఘనంగా శ్రీపాదరావు జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు 89వ జయంతి సందర్భంగా ధన్వాడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చీటూరి మహేష్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి ఉమాదేవి, పాలకవర్గ సభ్యులు కలిసి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ప్రజాసేవ, నిబద్ధత, పారదర్శక రాజకీయ విలువలు గురించి మాట్లాడారు.

సర్పంచ్ మాట్లాడుతూ.. “శ్రీపాదరావు  ప్రజల సమస్యలను సభలో బలంగా ప్రస్తావించిన నాయకుడు. ఆయన చూపిన మార్గంలోనే ప్రజాసేవ చేయడం మనందరి బాధ్యత” అని పేర్కొన్నారు. గ్రామంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -