- Advertisement -
- – గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ కోడి శ్రీనివాసులు..
– గాంధీజీ ఫౌండేషన్ వారి 27వ నెల సరుకుల పంపిణీ - ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయం
- మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు
- నవతెలంగాణ – చండూరు
- ప్రాణం ఉన్నంతవరకు నిరుపేదలకు సేవ చేస్తాం అని గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్, చండూర్ మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు తెలిపారు. స్థానిక గాంధీ స్కూల్లో గాంధీజీ ఫౌండేషన్ వారి 27వ నెల సరుకులు నిరుపేదలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా జీవితం ఉన్నంతవరకు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ, సమాజంలో ఆదర్శవంతంగా జీవిస్తామని చెప్పారు.
- నిత్యావసర సరుకులు అందుకుంటున్న పేదలు మీరిచ్చే సరుకులు నెల రోజులు సరిపోతున్నాయని, ఆ సరుకులతో వంటలు చేసుకుని తింటూ, ఆరోగ్యంగా జీవిస్తున్నామని ఆనందభాష్పాలతో చెబుతున్నారని అన్నారు. నిరుపేదల కండ్లల్లో ఆనందాన్ని చూడడమే గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు. గాంధీజీ ఫౌండేషన్ పేదల పక్షపాతి అని, ప్రాణం ఉన్నంతవరకు నిరుపేదలకు సేవ చేస్తూనే ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ భార్గవ్, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, బోడ సాయిరామ్, బుషిపాక యాదగిరి,బోడ విజయ్,గోపి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



