- Advertisement -
నవతెలంగాణ – మిడ్జిల్
మండలంలోనీ దోనూర్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు విద్యను బోధించారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని చెప్పారు.
15 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా తమ విధులు నిర్వహించారు. ఉత్తమ బోధన చేసిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తారా సింగ్, ఉపాధ్యాయులు లక్ష్మయ్య, కృష్ణ నాయక్, అంజమ్మ గ్రామ పెద్దలు శ్రీనివాసులు, బాల్ రెడ్డి, సుధాకర్ గౌడ్ , ఈశ్వర్,ఆంజనేయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



