Monday, March 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇళ్ల నిర్మాణ అనుమతులపై విచారణ జరిపించాలి  

ఇళ్ల నిర్మాణ అనుమతులపై విచారణ జరిపించాలి  

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌన్ 
ఆలేరు మున్సిపల్ కేంద్రంలో ఇళ్ల నిర్మాణ అనుమతులపై  విచారణ జరిపించాలని, అవక తవకులకు పాల్పడువున్న, టౌన్ ప్లానర్ పై చర్యలు తీసుకోవాలని   డిమాండ్ చేస్తూ..ఆలేరు పట్టణంలో సోమవారం భారత్ నగర్ కాలనీ వాసులు, మున్సిపాల్ కార్యలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పలువురు మాట్లాడుతూ 8వ వార్డులో నూతనంగా ఇల్లు నిర్మాణం చేస్తున్న వ్యక్తి రోడ్డును ఆక్రమించుకొని ఇల్లు నిర్మాణం చేస్తున్న విషయమై, మున్సిపాలిటీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసేప్పటికీ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. రోడ్డును ఆక్రమించుకొని ఇల్లు నిర్మాణం చేసి, ప్రజలు నడిచే దారికి ఇబ్బందులు గురయ్యే విధంగా  వ్యవహరింస్తున్నా వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు. లేని యెడల  మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు కాపీని అందజేశారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, టౌన్ ప్లానర్ వీరస్వామిని నవతెలంగాణ దినపత్రిక ఇంటి అనుమాతులపై వివరణ కోరగా .. రోడ్డును ఆక్రమించుకొని నిర్మాణం చేస్తున్న ఇంటి అనుమతిపై విచారణ జరుగుతుందని చెప్పారు. నిబంధనల మేరకే అనుమతులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జంపాల దశరథ, ఎగ్గిడి సంపత్, ఎగ్గిడి శ్రీనివాస్, చీర శ్రీనివాస్, ఎగ్గిడి పుల్లయ్య, మైల వెంకటేష్, కటకం హరి, కటకం విజయ్, బేతి గణేష్,దయ్యాల సంపత్, ఉమా,లక్ష్మి బాలమని, విమల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -