నవతెలంగాణ – మల్హర్ రావు
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ స్పీకర్,అజాత శత్రువు దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు పురస్కరించుకుని సోమవారం యూత్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు మండల రాహుల్ ఆధ్వర్యంలో శ్రీపాదరావు జయంతి వేడుకలు సోమవారం గాదంపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పిల్లలందరికీ పంచారు.
అనంతరం గాదంపల్లి, అడ్వాలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, మధ్యాహ్న భోజనం తినడానికి ప్లీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, పెద్దతూండ్ల గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మాజీ సర్పంచి రాజు నాయక్, కాంగ్రెస్ నాయకులు అడ్వాల మహేష్, జక్కుల వెంకటస్వామి యాదవ్, రాజు నాయక్, జంబోజు రవిందర్, బియని రాజమొగిలి, కిషన్ నాయక్ పాల్గొన్నారు.



