నవతెలంగాణ – మల్హర్ రావు
ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్, అజాత శత్రువు, మంథని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకల్లో భాగంగా మండలంలోని పెద్దతూండ్ల గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం ఆధ్వర్యంలో సోమవారం శ్రీపాదరావు జయంతి వేడుకలు పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మంథని అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన గొప్పనాయకుడు శ్రీపాదరావుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు నాయక్, జక్కుల వెంకటస్వామి యాదవ్, జంబోజు రవిందర్, బియని రాజమొగిలి, కేశవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.



