- Advertisement -
వరంగల్ ఆర్ఎంకు వినతిపత్రం సమర్పణ
నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం, మల్హర్ మండలాల సరిహద్దుల్లో ఉన్న బస్వాపూర్ స్టేజీవద్ద ఎక్స్ ప్రెస్ బస్సులను ఆపాలని వరంగల్ ఆర్ఎం విజయ్ బాను కు రుద్రారం గ్రామ సర్పంచ్ చంద్రగిరి సంపత్ ఆధ్వర్యంలో సోమవారం వినపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బస్వాపూర్ స్టేజి వద్ద వరంగల్-1, వరంగల్-2, పరకాల, భూపాలపల్లి ఎక్స్ప్రెస్ బస్సులను ఆపాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గాదే గట్టయ్య, చంద్రగిరి అశోక్, జాడి అనసూయ-సమ్మయ్య, టేకం రవళి బుచ్చయ్య, సంగేo సత్యనారాయణ, మంతెన సూర్య కిరణ్, నస్పూరి వెంకటేష్ పాల్గొన్నారు.
- Advertisement -



