Monday, March 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్లలో ఘనంగా శ్రీపాదరావు జయంతి వేడుకలు

తాడిచెర్లలో ఘనంగా శ్రీపాదరావు జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్, అజాత శత్రువు, మంథని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకల్లో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్లలో గ్రామ సర్పంచ్ బండి స్వామి, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కేశారపు చెంద్రయ్య ఆధ్వర్యంలో సోమవారం శ్రీపాదరావు జయంతి వేడుకలు హనుమాన్ సెంటర్ ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్  పంచారు. శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మంథని అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన గొప్పనాయకుడు శ్రీపాదరావుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, వార్డు సభ్యులు వొన్న తిరుపతి రావు, ఇందారపు చెంద్రయ్య, సారయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తిర్రి సమ్మయ్య, ఇందారపు ప్రభాకర్, పల్లెర్ల మధు, మెరుగు రాజయ్య, యూత్ నాయకులు ఇందారపు రాకెష్, బండి రణదీర్, ప్రశాంత్, తుంగపల్లి సాద్విక్, భూమయ్, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -