Monday, March 2, 2026
E-PAPER
Homeజిల్లాలుమాదారంలో బయటపడ్డ పురాతన విష్ణుమూర్తి విగ్రహం

మాదారంలో బయటపడ్డ పురాతన విష్ణుమూర్తి విగ్రహం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మహాముత్తారం మండలం మాదారం గ్రామ శివారులోని పెద్ద వాగులో ఆదివారం పురాతన విష్ణు మూర్తి విగ్రహం బయటపడింది. మూడేళ్ల కిందట వాగులో చేపలు పట్టేందుకు వెళ్లిన గ్రామస్థులు విగ్రహాన్ని చూశారు. పూజలు చేసి వది లేయడంతో ఇసుకలో కూరుకుపోయింది. మళ్లీ ఈ ఏడాది వాగులో తల భాగం కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి స్పందించి గ్రామానికి చేరుకొని చింతకాని, జగ్గయ్య పల్లి గ్రామస్థులు, జేసిబి సహాయంతో విగ్రహాన్ని ఆదివారం బయటకు తీయించారు. విగ్రహాన్ని తమ గ్రామానికి తీసుకెళ్తామని జగ్గయ్యపల్లి గ్రామస్థులు పట్టుబట్టారు. విగ్రహం తన చేను బయట పడటంతో ఆలయ నిర్మాణానికి స్థలం ఇస్తానని, ఇక్కడే ప్రతిష్ఠించాలని ఓ రైతు కోరాడు.

రెండు మూడు రోజుల్లో ఆయా గ్రామాల పెద్దల సమక్షంలో మాట్లాడి తేల్చుకుందామని విగ్రహాన్ని వాగులోనే ఉంచి వెళ్లిపోయారు. విగ్రహం రూపాన్ని బట్టి కాకతీయుల కాలం నాటిదిగా చర్చించుకుంటున్నారు. విగ్రహం ముక్కు, చేతులు, భుజం భాగంలో కొంత ధ్వంసమై ఉంది. గుప్తనిధుల వేటగాళ్లు గతంలో విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు అనుమానాలున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -