Monday, March 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా గంగారంలో శ్రీపాదరావు జయంతి వేడుకలు

ఘనంగా గంగారంలో శ్రీపాదరావు జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, ప్రజాస్వామ్య పరిరక్షకుడు దుద్దిళ్ల శ్రీపాద రావు జయంతి వేడుకలు కాటారం మండలం గంగారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బండం శోభా రాంరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

మొదటగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సర్పంచ్ బండం శోభా రాంరెడ్డి మాట్లాడుతూ, “శ్రీపాద రావు గారు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి, నిష్పక్షపాతంగా వ్యవహరించిన గొప్ప నాయకుడు. స్పీకర్‌గా ఉన్న సమయంలో సభా పరిపాలనలో ఆదర్శంగా నిలిచారు. ఆయన సేవలు ప్రజలకు ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయి” అని కొనియాడారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని శ్రీపాద రావు గారి సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో సాగింది.ఈ కార్యక్రమం లో కార్యదర్శి బిరెల్లి కర్ణాకర్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -