ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శక, నిర్మాతగా డిఎస్ రెడ్డి సమర్పణలో అక్సఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్‌గా, కిరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆర్ కే దీక్ష’.
తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ ఇతర కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ మొదటి వారంలో థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ,’ప్రస్తుతం సెన్సార్ పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో మా చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సిటీలోనే వంద స్క్రీన్స్‌లో మా మూవీని రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. దీక్ష, పట్టుదల ఉంటే ఎవరైనా జీవితంలో ఏదైనా సాధించగలరు అని చెప్పే మంచి సందేశంతో రూపొందించాం. అక్సాఖాన్ డ్యాన్సర్ క్యారెక్టర్‌లో కనిపించనుంది. ఆమె ప్రియుడిగా సైకో క్యారెక్టర్‌లో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన రోహిత్ శర్మ నటిస్తున్నారు.
రాజ్ కిరణ్ మ్యూజిక్ చేసిన ఐదు పాటలు హిట్టయ్యాయి. మధు ప్రియ 3 పాటలు, గీతా మాధురి ఒక పాట పాడారు. ఈ పాటలన్నీ ఇప్పటికే మంచి ఆదరణ పొందుతున్నాయి. కిరణ్ హీరోగా నటిస్తున్నాడు. ఆయన ఈ మూవీలో భీముడి పాత్రలో చెప్పిన నాన్ స్టాప్ 1 మినిట్ డైలాగ్ హైలైట్ అవుతుంది. మా సంస్థలో నెక్ట్స్ ‘మహిళా కబడ్డీ’ మూవీ నిర్మిస్తున్నాం’ అని తెలిపారు. ‘ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో అక్సాఖాన్ ప్రియుడి పాత్రలో నటిస్తున్నాను. డ్యాన్సర్‌గా ఎదగాలని ప్రయత్నించే ఆమెను వేధించే సైకో లవర్‌గా కనిపిస్తాను. ఈ సినిమాతో నటుడిగా నాకు మంచి గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నా’ అని నటుడు రోహిత్ శర్మ చెప్పారు. తులసి మాట్లాడుతూ,’నేను ఈ చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో నటించాను. అక్సాఖాన్ పర్‌ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. హీరోగా కిరణ్, విలన్‌గా రోహిత్ శర్మ తమ నటనతో మెప్పిస్తారు’ అని అన్నారు.
ఏప్రిల్‌లో రిలీజ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



