ముంబయి : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అంచనాలకు మించి రాణిస్తున్న దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎడన్ మార్క్రామ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 175.16 స్ట్రయిక్‌రేట్‌తో ఉత్తమ ఓపెనర్‌గా నిలిచిన మార్క్రామ్ ఆటను ఐపీఎల్ మార్చివేసిందని సఫారీ మాజీ క్రికెటర్ డుప్లెసిస్ అన్నాడు. ‘ఐపీఎల్లో లక్నో తరఫున ఓపెనర్‌గా ఆడిన మార్క్రామ్.. తన ఆటతీరును గొప్పగా మార్చుకున్నాడు. ఐపీఎల్లో ఆడేందుకు కచ్చితంగా ఓ పద్దతిలోనే ఆడాలి, లేదంటే జట్టులో చోటు ఉండదు. ఓపెనర్‌గా సంప్రదాయ బ్యాటింగ్ ఆడలేం. డిమాండ్‌కు అనుగుణంగా బ్యాటింగ్‌ను మార్చుకున్న మార్క్రామ్ ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లోనూ రాణిస్తున్నాడు. డుప్లెసిస్ జోరు పట్ల గర్వపడుతున్నాను, కానీ అతడి ప్రదర్శనపై ఆశ్చర్యమేమీ లేదు’ అని డుప్లెసిస్ అన్నాడు.



