– ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : హౌలీ సందర్భంగా టీజీసీఎస్‌బీ భద్రతా హెచ్చరిక
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
హౌలీ పండుగ నేపథ్యంలో ఆన్‌లైన్, డిజిటల్ చెల్లింపుల మోసాలు జరగొచ్చని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఆ శాఖ డీజీ శిఖా గోయల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పండుగ షాపింగ్, ఈవెంట్ బుకింగ్స్, ప్రయాణ ఏర్పాట్లు, ఆన్‌లైన్ గిఫ్ట్ ఆర్డర్లు, సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న పరిస్థితిని సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసి వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. వాట్సాప్, ఎస్‌ఎంఎస్, సోషల్ మీడియా, ఈమెయిల్ ద్వారా భారీ డిస్కౌంట్లతో హౌలీ ఆఫర్లు, కలర్స్, గిఫ్ట్ హ్యాంపర్లు, పార్టీ పాస్‌లు వంటి నకిలీ సందేశాలు పంపుతున్నారనీ, నకిలీ ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, మోసపూరిత పేమెంట్ లింకుల ద్వారా బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారని హెచ్చరించారు. ఆ లింకులు నకిలీ వెబ్‌సైట్లకు తీసుకెళ్తాయనీ, హానికరమైన యాప్‌లను ఇన్‌స్టాల్ చేయిస్తాయని, ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయిస్తాయని వివరించారు. ఓటీపీలు, కార్డ్ వివరాలు, లాగిన్ సమాచారాన్ని నేరగాళ్లు సేకరించి, ఆ ఖాతాలను ఉపయోగించి బాధితుడి పరిచయస్తులను కూడా మోసగిస్తారని హెచ్చరించారు. అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, అలాంటి లింక్‌లను క్లిక్ చేసినా, మోసం జరిగిందని అనిపించినా వెంటనే ఆర్థిక లావాదేవీలు నిలిపివేయాలని సూచించారు. సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కు కాల్ చేయాలనీ, లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సైబర్‌క్రైమ్.జీఓవీ.ఇన్‌లో ఫిర్యాదు చేయాలని వివరించారు.
ఆన్‌లైన్ మోసాలతో జాగ్రత్త
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



