Tuesday, March 3, 2026
E-PAPER
Homeఆటలుఅఫ్గాన్‌తో ఓ టెస్టు, వన్డే సిరీస్‌

అఫ్గాన్‌తో ఓ టెస్టు, వన్డే సిరీస్‌

- Advertisement -

జూన్‌లో భారత పర్యటన ఖరారు

ముంబయి : ఓ టెస్టు, 3 వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌ కోసం అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ జట్టు ఈ ఏడాది జూన్‌లో భారత పర్యటనకు రానుంది. భారత్‌, అఫ్గనిస్తాన్‌ ఏకైక టెస్టు మ్యాచ్‌కు న్యూ చంఢగీడ్‌ ఆతిథ్యం ఇవ్వనుండగా, వన్డే సిరీస్‌కు ధర్మశాల, లక్నో, చెన్నై వేదిక కానున్నాయి. జూన్‌ 6 నుంచి టెస్టు మ్యాచ్‌ ఆరంభం కానుండగా.. తొలి వన్డే 14, రెండో వన్డే 17, మూడో వన్డే 20న జరుగనున్నాయి. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మే 31న ముగియనుండగా.. ఆరు రోజుల్లోనే అఫ్గనిస్తాన్‌తో భారత్‌ టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. భారత్‌, అఫ్గనిస్తాన్‌ తొలి టెస్టు 2018లో బెంగళూర్‌లో జరిగింది. భారత్‌, అఫ్గాన్‌లు వన్డే సిరీస్‌ ఆడనుండటం ఇదే ప్రథమం కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -