కనీస వేతనం ఇప్పించాలి
దక్షిణ తెలంగాణ విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికుల డిమాండ్
ధర్నాచౌక్‌లో మహాధర్నా
నవతెలంగాణ – ముషీరాబాద్
పీస్ రేట్ మీటర్ రీడర్స్ కార్మికులకు 30 రోజుల పని కల్పించాలని ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, దక్షిణ తెలంగాణ విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికులకు 30 రోజుల పని, కనీస వేతనం కల్పించాలని సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్పీడీసీఎల్ తరహాలో 30 రోజుల పని కల్పించాలన్నారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. సబ్ స్టేషన్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను ఉత్తీర్ణత కలిగిన మీటర్ రీడర్లతో భర్తీ చేయాలన్నారు. మిగతా కార్మికులను వారి వారి అర్హతను బట్టి మిగిలిన భాగాలలో సర్దుబాటు చేయాలన్నారు. టీజీఎన్పీడీసీఎల్ ఇచ్చిన సెమీస్కిల్స్ ఆర్డర్ కాపీ టీజీ ఎస్పీడీసీఎల్‌లో కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాజుల శ్రీనివాస్ గౌడ్, దక్షిణ తెలంగాణ విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు పాల్గొన్నారు.
పీస్ రేట్ మీటర్ రీడర్స్ కార్మికులకు పూర్తి పని కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



