Tuesday, March 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండిస్ట్రిక్ట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఫండ్‌ నుంచి రూ.లక్ష

డిస్ట్రిక్ట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఫండ్‌ నుంచి రూ.లక్ష

- Advertisement -

– పాప తండ్రి గణేష్‌కు అవుట్‌ సోర్సింగ్‌ జాబ్‌
– కుటుంబానికి 2 పడకల గది
– బీసీ కమిషన్‌కు నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ నివేదిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

నాగర కర్నూల్‌ జిల్లా కుమ్మెర జాతర సంఘటనపై ఆ జిల్లా కలెక్టర్‌ బద్వావత్‌ సంతోష్‌ రాష్ట్ర బీసీ కమిషన్‌ కు నివేదిక సమర్పించారు. రెండు నెలల పాప మరణించడం, ఆందోళన నెలకొన్న నేపథ్యంలో మార్చి 24న బీసీ కమిషన్‌ చైర్మెన్‌ జి.నిరంజన్‌ నేతత్వంలో సభ్యులు కుమ్మెర గ్రామాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఆ సందర్భంగా నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ నివేదిక సోమవారం కమిషన్‌కు అందింది.
డిస్ట్రిక్ట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఫండ్‌ నుంచి రూ.లక్ష ఇవ్వడంతో పాటు పాప తండ్రి గణేష్‌ కు నాగర్‌ కర్నూల్‌ మెడికల్‌ కాలేజీలో అవుట్‌ సోర్సింగ్‌ జాబ్‌ ఇచ్చినట్టు తెలిపారు. ఆ కుటుంబానికి 2 పడగల గదిని ఇవ్వనున్నామనీ, అదే విధంగా అన్ని విధాలుగా వైద్య సదుపాయాలు కల్పించేందుకు హామీ ఇచ్చినట్టు కలెక్టర్‌ నివేదికలో పేర్కొన్నారు. ”గత నెల 17 నుంచి 20 వరకు జాతరకు 20 వేల మంది భక్తులు హాజరయ్యారు. 18న సాయంత్రం 8.30 గంటల ప్రాంతంలో యు.శ్రీనివాస్‌ రెడ్డి నాగర్‌కర్నూల్‌ పోలీస్‌ స్టేషన్‌లో చంద్రకళ, బౌరమ్మ, గణేష్‌లపై ఫిర్యాదు చేశారు. అదే రోజు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో గణేష్‌ పోలీస్‌ స్టేషన్‌లో శ్రీనివాస్‌ రెడ్డి, మరో ఆరుగురిపై ఫిర్యాదు చేశారు. 21న మౌనిక తన 2 నెలల పాప స్పందించడం లేదని నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఉదయం 6 గంటల నుంచి పాప స్పందించడం లేదని ఆమె తెలిపారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో డ్యూటీ డాక్టర్‌ ఆ పాప చనిపోయినట్టు డిక్లేర్‌ చేశారు. తల్లి మౌనిక అనుమానం మేరకు అనుమానాస్పద కేసుగా నాగర్‌కర్నూల్‌ పీఎస్‌లో రిజిస్టర్‌ చేశారు. 23న ఏ1 శ్రీనివాస్‌ రెడ్డి, ఏ2 మధుసూదన్‌ రెడ్డి, ఏ3 శ్రీకాంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి జ్యుడిషియల్‌ కస్టడికి పంపారు. మిగతా 6 గురు నిందితులు పరారిలో ఉన్నారు. పాప తల్లి మౌనిక కులాన్ని నిర్ధారించడానికి ఆధారంగా ఎటువంటి సర్టిఫికేట్లు అందజేయలేదు. ఆమె కులాన్ని నిర్ధారించడానికి మహమ్మదాబాద్‌ తహశీల్దార్‌కు ఆదేశించారు. మౌనిక తల్లి బాలక్రిష్ణమ్మ పిచ్చగుంట్ల (వంశరాజ్‌) కులానికి చెందినదనీ, ఆ కులం బీసీ-ఏ సీరియల్‌ నెం.18గా తెలుపుతూ లెటర్‌ నెం. బి/306/2026, తేది : 26.02.2026 ద్వారా తెలిపారు….. ” అని కలెక్టర్‌ నివేదికలో పేర్కొన్నారు. ”పాప గతేడాది డిసెంబర్‌ 21న జన్మించింది. నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రిలో అడ్మిట్‌ చేయగా నిలోఫర్‌ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. గతేడాది డిసెంబర్‌ 21 నుంచి ఈ ఏడాది జనవరి 21 వరకు హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకొని, చికిత్స అందించారు….. ” అని నివేదికలో వెల్లడించారు. కలెక్టర్‌ రిపోర్టులో నిలోఫర్‌, నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రుల నివేదికలు, తహశీల్దార్‌ నివేదిక, పంచనామాలు బీసీ కమిషన్‌కు సమర్పించిన నివేదికతో పాటు సమర్పించినట్టు కమిషన్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -