Tuesday, March 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపక్కాగా 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'

పక్కాగా ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’

- Advertisement -

– అధికారులు మానిటరింగ్‌ చేయాలి
– మార్చి 6 నుంచి జూన్‌ 12 వరకు 99 రోజులు : రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌
– జీహెచ్‌ఎంసీ కార్పొరేషన్‌ సమావేశం
నవతెలంగాణ-సిటీబ్యూరో

‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీలో రిజల్ట్‌ ఓరియెంటెడ్‌గా అమలు చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక అధికారి జయేష్‌ రంజన్‌ జీహెచ్‌ఎంసీ అధికారులకు కర్తవ్యబోధ చేశారు. సోమవారం ఆయన అధ్యక్షతన మొట్టమొదటి జీహెచ్‌ఎంసీ కార్పొరేషన్‌ సమావేశం జరిగింది. గత జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీలో తీర్మానించిన 30 అంశాలపై చర్చించి జీహెచ్‌ఎంసీ కార్పొరేషన్‌ కమిటీ ఆమోదం తెలిపింది. అనంతరం.. మార్చి 6 నుంచి జూన్‌ 12 వరకు 99 రోజులపాటు ప్రణాళికపై అధికారులకు ప్రత్యేక అధికారి దిశా నిర్దేశం చేశారు. 14 వారాలపాటు ఈ కార్యక్రమం ఒక్కో వారం ఒక్కో థీమ్‌తో జరగనుందన్నారు. పారిశుధ్యంతో మొదటి వారం ప్రారంభమై విద్య, వైద్యం, మహిళా, రైతు, యువత, పర్యావరణం తదితర థీమ్‌లతో జరగనుందన్నారు. మొదటి వారం పారిశుధ్యం పేరుతో జరిగే కార్యక్రమంలో గార్బేజ్‌ వల్నరబుల్‌ పాయింట్‌లపై ప్రత్యేక దృష్టి సారించి తొలగించాలన్నారు. ఇస్టారీతన చెత్తను వేసే వారిపై జరిమానాలు విధించడం, చెరువులు, సరస్సులలో వాలంటీర్‌ల సహకారంతో గార్బేజ్‌ తొలగించడం, టెక్స్‌టైల్‌ వేస్ట్‌ను సేకరించడం వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రభావవంతంగా చేపట్టాలన్నారు. యూత్‌ వీక్‌లో యువతలో నైపుణ్యాల అభివృద్ధి పెంపొందించే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. యాంటీ డ్రగ్‌ చైతన్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు. 99 రోజుల కార్యక్రమాలపై అంతర్గతంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం సక్సెస్‌ అయ్యేలా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. రెండ్రోజుల్లో సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ జీహెచ్‌ఎంసీకి చెందిన అస్సెట్‌లు, లయబిలిటీ మూడు కార్పొరేషన్‌లకు పంపిణీ చేసే ప్రక్రియను పూర్తిచేసి రిపోర్టు అందించనుందని తెలిపారు.

30 ఐటమ్‌లకు ఆమోదం
జీహెచ్‌ఎంసీ కార్పొరేషన్‌ సమావేశంలో 30 ఐటమ్‌లకు ఆమోదం తెలిపారు. ఓవైసీ జంక్షన్‌ ఫ్లైఓవర్‌ నుంచి సంతోష్‌నగర్‌ వైపు లెఫ్ట్‌ ఆర్మ్‌ డౌన్‌ ర్యాంప్‌ నిర్మాణానికి రోడ్డు అభివద్ధితోపాటు రసూల్‌పురా జంక్షన్‌ వద్ద 4 లేన్‌ యూనీడైరెక్షనల్‌ రోడ్డు నిర్మాణానికి సవరించిన ప్రణాళిక ఆస్తుల స్వాధీనం ప్రతిపాదనకు జీహెచ్‌ఎంసీ ఆమోదం తెలిపింది.ఖిల్వత్‌లో చౌమహల్లా ప్యాలెస్‌ సమీపంలో మల్టీ లెవల్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం,రెతిబౌలి, నానల్‌నగర్‌ జంక్షన్లలో ఫ్లైఓవర్‌/ గ్రేడ్‌ సెపరేటర్లు మాస్టర్‌ ప్లాన్‌ మార్పులు, ఫలక్‌నుమా, ఫతేనగర్‌ ఫ్లైఓవర్‌ పునరుద్ధరణ పనులతోపాటు వివిధ అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వీ కర్ణన్‌, అదనపు కమిషనర్‌లు సత్యనారాయణ, జోనల్‌ కమిషనర్‌లు కమిషనర్‌లు ప్రియాంక అల, మందా మకరందు, జి.ముకుందరెడ్డి, కేఏ మంగతాయారు, ఎస్‌.శ్రీనివాసరెడ్డి, చంద్రకళ, విజిలెన్స్‌ ఏఎస్పీ నరసింహ రెడ్డి, చీఫ్‌ ఇంజినీర్‌ రత్నాకర్‌, జ్యోతిర్మయి, సీసీపీ కె.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -