– రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి
నవతెలంగాణ-నల్లగొండటౌన్
ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ఈ ఘటన నల్లగొండ మండల పరిధిలోని చందనపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. నల్లగొండ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నక్కలపల్లి గ్రామానికి చెందిన వంశీ(20), ఊట్కూరు గ్రామానికి చెందిన రవి(21) బావబామ్మర్దులు. వీరు ఇంటర్ పరీక్ష రాసేందుకు బైక్‌పై నల్లగొండ నుంచి నకిరేకల్ వైపునకు వెళ్తుండగా చందనపల్లి గ్రామసమీపంలో ఎదురుగా వస్తున్న ఎస్పీఆర్ పాఠశాల(నల్లగొండకు చెందిన) స్కూల్ బస్సు ఢకొీట్టింది. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళ్తూ ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



