Tuesday, March 3, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసమీక్ష కోసం వచ్చారా? రూ.వెయ్యి కోట్ల కోసం వచ్చారా?

సమీక్ష కోసం వచ్చారా? రూ.వెయ్యి కోట్ల కోసం వచ్చారా?

- Advertisement -

రాహుల్‌ గాంధీకి కేటీఆర్‌ ప్రశ్న

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలుపైన సమీక్ష కోసం వచ్చారా? లేదంటే రూ.వెయ్యి కోట్ల తీసుకుపోవడానికి వచ్చారా?అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని రాహుల్‌ గాంధీని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈ మేరకు కేటీఆర్‌ పలు ప్రశ్నలతో సోమవారం ఎక్స్‌ ద్వారా ట్వీట్‌ చేశారు. ఏఐసీసీకి ఏటీఎంగా మారిన తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం అంటూ చురక అంటించారు. మొన్న రాహుల్‌గాంధీకి రేవంత్‌రెడ్డి ఇస్తానన్న రూ.వెయ్యి కోట్లు తీసుకోవడానికి తెలంగాణకు వచ్చారా?అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలుపై మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. హామీల అమలు పురోగతిని సమీక్షిస్తారా? లేదా చెప్పాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని రాహుల్‌ గాంధీని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -