2.6 బిలియన్ డాలర్ల విలువైన సరఫరాకు సంతకాలు
న్యూఢిల్లీ: భారత్-కెనడా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. 2.6 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం సరఫరా ఒప్పందం మీద రెండుదేశాలు సంతకాలు చేశాయి. అలాగే సమగ్ర ఆర్థిక భాగ స్వామ్య ఒప్పందం ( సీఈపీఏ) పై చర్చలు జరిపేందుకు సోమ వారం అంగీకారం కుదిరింది. హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్రమోడీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.దేశంలో పౌర అణుఇంధన కార్యక్రమానికి నిరంతరాయ సరఫరాను కొనసాగించడమే ఈ డీల్ ఉద్దేశం. చిన్న రియాక్టర్లు, అధునాతన రియాక్టర్లపై కలిసి పనిచేయనున్నామని మోడీ తెలిపారు అలాగే 2026 చివరినాటికి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై కొలిక్కి రావాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నట్టు కార్నీ వెల్లడించారు. 1893లో స్వామి వివేకానంద కెనడాలో పర్యటించిన విషయాన్ని మార్క్ కార్నీ గుర్తుచేసుకున్నారు.”లేవండి.. మేల్కొనండి.. లక్ష్యం చేరేవరకు ఆగకండి” అన్న వివేకానంద సూక్తిని ప్రస్తావించారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు కార్నీ భారత్‌లో పర్యటిస్తున్నారు.
భారత్-కెనడా మధ్య యురేనియం డీల్
- Advertisement -
- Advertisement -



