Tuesday, March 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరక్షణ పేరిట 'భారం'.. రోడ్ల నిండా 'గండం'!

రక్షణ పేరిట ‘భారం’.. రోడ్ల నిండా ‘గండం’!

- Advertisement -

‘రోడ్‌ సేఫ్టీ సెస్‌’ అమలు షురూ..
రాష్ట్రంలో మృత్యుదారులు..
నిత్యం ప్రమాదాలు
రోడ్డు భద్రతా ఏర్పాట్లలో
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం
కొత్త పన్ను నిధులొచ్చినా.. పనులు జరిగేనా?
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

రాష్ట్రంలో కొత్తగా వాహనం కొనాలంటే ఇకపై ‘భద్రత’ కోసం భారీగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. తెలంగాణ మోటార్‌ వాహనాల పన్ను చట్టం-1963కు సవరణలు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘రోడ్డు సేఫ్టీ సెస్‌’ మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాల సాకుతో వసూలు చేస్తున్న ఈ నిధులు నిజంగానే రహదారులను సురక్షితం చేస్తాయా? లేక కేవలం ఖజానా నింపుకోవడానికేనా? అన్న సందేహాలు వాహన దారుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే, పన్నులు వసూలు చేయడంలో చూపిస్తున్న ఉత్సాహం, రహదారుల భద్రతను మెరుగుప రచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూపడం లేదనే విమ ర్శలు వెల్లువెత్తు తున్నాయి. ముఖ్యంగా వాహ నాల రద్దీ విపరీతంగా పెరిగిన ఉమ్మడి కరీం నగర్‌ జిల్లాలో ‘బ్లాక్‌ స్పాట్‌లు’ మృత్యుకు హరా లుగా మారుతున్న వైనంపై ‘ప్రత్యేక’ కథనం.

పన్నుల మోత.. ఇలా!
కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ సమయంలోనే ఈ వన్‌-టైమ్‌ సెస్‌ వసూలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు రూ.2వేలు, లైట్‌ మోటార్‌ వెహికల్స్‌ (కార్లు/జీపులు)కు రూ.10వేలు, ట్రాక్టర్ల(వ్యవసాయేతర)కు రూ.5వేలు, ఇతర రవాణా వాహనాలకు రూ.10వేల వరకు ప్రభుత్వం పన్ను స్లాబ్‌లు విధించింది. ఈ పన్ను ద్వారా ఏడాదికి సుమారు రూ.350 కోట్ల నుంచి రూ.390 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. ఈ నిధులను ‘నాన్‌-లాప్సబుల్‌’ ఫండ్‌గా ఉంచి, కేవలం రోడ్డు భద్రతా చర్యలకే వాడతామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

మృత్యుదారిలో ఉమ్మడి కరీంనగర్‌
హైదరాబాద్‌, రంగారెడ్డి తరువాత అత్యధికంగా వాహనాలు అమ్ముడవుతున్న ప్రాంతం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అనే చెప్పొచ్చు. 2020లో సుమారు 7.25 లక్షలుగా ఉన్న వాహనాల సంఖ్య, ఐదేండ్లలో ఏకంగా 11 లక్షలు దాటింది. జిల్లాలవారీగా చూస్తే కరీంనగర్‌ (6,67,538), జగిత్యాల (1,76,211), రాజన్న సిరిసిల్ల (1,56,421), పెద్దపల్లి (1,45,734) వాహనాలు ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ అయి ఉన్నాయి. అయితే గతేడాది రోడ్డు ప్రమా దాల్లో మరణాల గణాంకాల పరిశీలిస్తే జగిత్యాలలో 150, పెద్దపల్లిలో 75 మంది మరణించగా, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 68మం ది, కరీంనగర్‌ జిల్లాలో అత్యధికంగా 164 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణం కోల్పో యారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే 2025 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య 22వేలు దాటగా, సుమారు 7,500 మంది ప్రాణం కోల్పోయారు. ఇందులో అత్యధికంగా యువత ఉండటం విషాదకరం.

రోడ్డు భద్రతా ఏర్పాట్లలో విఫలం..
ఎస్‌హెచ్‌(స్టేట్‌హైవే)-1లో యూ-టర్స్‌ వద్ద బారికేడ్లు, పెడెస్ట్రియన్‌ గార్డ్‌ రైలింగ్‌ ఎక్కడా జాడ లేదు. విద్యాసంస్థలు ఎక్కువగా ఉన్న కరీంనగర్‌ జిల్లా కేంద్ర శివారులోని రేకుర్తి- కొత్తపల్లి దారిలో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక నిఘా కరువైంది. గ్రానైట్‌ లారీల అతివేగం, హైవేలపై లైటింగ్‌, శాస్త్రీయమైన మలుపులు లేకపోవడమే ఇటీవల తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణాలుగా మారుతున్నాయి. మరోవైపు ఈ ఏడాది జనవరి చివరివారంలో గత జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అధ్యక్షతన జరిగిన రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్‌హెచ్‌- 563 కరీంనగర్‌-వరంగల్‌ రహదారిలో బ్లాక్‌ స్పాట్ల మరమ్మతుల కోసం రూ.35.41 కోట్లు మంజూ రయ్యాయి. అయితే ఈ నిధుల విడుదల, మర మ్మతుల పనుల ప్రక్రియ ఇంకా మొదల వ్వలేదు. ప్రభుత్వం పన్నులు వసూలు చేయ డమే కాకుండా, అశాస్త్రీయ మలుపులను సరిది ద్దడం, నిరంతర హైవే పెట్రోలింగ్‌, జంక్షన్ల వద్ద లైటింగ్‌ వంటి కనీస మౌలిక వసతులపై దృష్టి సారించాలి. అప్పుడే వాహనదారుడు చెల్లించే ‘సెస్‌’కు అర్థం ఉంటుంది, ప్రాణాలకు రక్షణ దొరుకుతుందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

రక్తసిక్తమవుతున్న రాజీవ్‌ రహదారి
ప్రభుత్వాలు మారుతున్నా, పన్నులు పెరుగుతున్నా ‘బ్లాక్‌ స్పాట్‌లు’ మాత్రం అలాగే ఉన్నాయి. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు గుండె తడి చేస్తున్నాయి గతనెల 21న కరీంనగర్‌ జిల్లాలోని కొత్తపల్లి (తిమ్మాపూర్‌) వద్ద అతివేగంతో వచ్చిన కారు బైక్‌ను ఢకొీట్టింది. మామ రామచంద్రం, అల్లుడు శ్రీనివాస్‌ అక్కడికక్కడే మరణిం చారు. ఇదే నెలలో హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీ బైపాస్‌ రోడ్డులో స్కూల్‌ బస్సును వెనుక నుంచి బైక్‌ ఢకొీట్టడంతో 21, 19 ఏళ్ల ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణం వదిలారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -