– స్వగ్రామం తుమ్మనపేటలో గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం
– గ్రామస్తులకు విందు భోజనం
నవతెలంగాణ-బల్మూరు
నల్లమల అటవీ సమీప ప్రాంతం బల్మూరు మండలంలో సోమవారం స్టార్ హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ-రష్మిక మందన సందడి చేశారు. విజయ్ స్వగ్రామమైన నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలోని తుమ్మెనపేటలో గృహప్రవేశం, వ్రతం, విందు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గ్రామస్తులు నూతన దంపతులకు భారీగా స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ దంపతులు, మాజీ ఎంపీ రాములు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, సర్పంచులు పాల్గొన్నారు. యువకులు విజరు దంపతులను చూసేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
సొంత ఊరి అభివృద్ధికి సహకరిస్తా : ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ
సొంత ఊరు అభివృద్ధికి తనకు తోచిన విధంగా సహకరిస్తానని విజయ్ దేవరకొండ అన్నారు. స్వగ్రామంలో ఈ కార్యక్రమం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. తన తమ్ముడి పెండ్లి గ్రామస్తుల సమక్షంలో ఇక్కడే చేస్తామని తెలిపారు. స్వగ్రామంలో ఇంటి నిర్మాణం, పెండ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉందన్నారు.
నల్లమలలో హీరో విజయ్ దేవరకొండ దంపతుల సందడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



