Tuesday, March 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమత్య్స పరిశ్రమ అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.ఐదువేల కోట్లు కేటాయించాలి

మత్య్స పరిశ్రమ అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.ఐదువేల కోట్లు కేటాయించాలి

- Advertisement -

9న కలెక్టరేట్ల ఎదుట నిరాహార దీక్షలు : తెలంగాణ మత్య్సకారులు, మత్య్సకార్మిక సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమానికి బడ్జెట్‌లో రూ. ఐదు వేల కోట్లు కేటాయించాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం డిమాండ్‌ చేసింది. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం అధ్యక్షులు గోరెంకల నర్సింహా అధ్యక్షతన కర పత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గొడుగు వెంకట్‌, బక్కి బాలమణి, గాండ్ల అమరావతి, మునిగల రమేష్‌, బోడంకి చందు, తేలు ఇస్తారి, మేఘనబోయిన శేఖర్‌ పాల్గొన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ మాట్లాడుతూ బడ్జెట్‌లో రూ. ఐదు వేల కోట్లు కేటాయించాలనీ, పెండింగ్‌లో ఉన్న 986 మందికి ఎక్స్‌గ్రేషియా రూ.50 కోట్లు ఈ బడ్జెట్‌లోనే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 9న రాష్ట్రంలోని కలక్టరేట్ల వద్ద నిరాహార దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇన్సూరెన్స్‌తో పాటు మరో రూ.ఐదు లక్షలు చెల్లిస్తామని చెప్పిందనీ కానీ..ఆ వాగ్దానాన్ని అమలు చేయలేదని విమర్శించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం జిల్లాలోని మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వాలనీ, గెట్‌ టూ గెదర్‌, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. 17న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -