Tuesday, March 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవం.. కాటారంలో అవగాహన ర్యాలీ

ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవం.. కాటారంలో అవగాహన ర్యాలీ

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవంసందర్భంగా కాటారం అటవీ క్షేత్ర సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించి వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. వన్యప్రాణులు ప్రకృతి సమతుల్యతకు ఆధారం అని, వాటి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.

కాటారం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో అటవీ సిబ్బంది నినాదాలతో ప్రజలను చైతన్య పరిచారు. అడవుల్లో వేట, అక్రమ రవాణా వంటి చర్యలను నిరోధించాల్సిన అవసరం ఉందని, వన్యప్రాణులు గ్రామాల వద్ద కనిపించినప్పుడు వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాటారం అటవీ క్షేత్రాధికారి శ్రీమతి జె. స్వాతి, డిప్యూటీ రేంజర్లు హెచ్. సురేందర్, జె. శ్రీనివాస్, సెక్షన్ ఆఫీసర్ శ్రీమతి ఈ. అర్చన, బీట్ ఆఫీసర్లు, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -