నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని గ్రామాలలో హోలీ సంబరాలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జుక్కల్ మండల కేంద్రంలోని గ్రామస్తులు సోమవారం రాత్రి కామ దహనం చేశారు. అదేవిధంగా ఒకరోజు ముందు నుండే ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ వేడుకలను పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు, సంబరాలు చేసుకున్నారు. హోలీ పండుగ రోజు కామ దహనం చేసి నిప్పును ఇంటికి తీసుకురావడం ఆ నిప్పులో శనగలు, కొబ్బరి కుడుకను కాల్చుకొని తినడం ఆనవాయితీగా వస్తుంది.
ఇలా ఎందుకు తింటారు అంటే నోటి దంతాలు పటిష్టంగా ఉంటాయని లేదా అది దంతాలకు సంబంధించిన పరీక్ష కొరకే శనిగలు కొబ్బరి కుడుకను తినడం జరుగుతుందని పెద్దలు చెప్తుంటారు. అదేవిధంగా కేమ్రాజ్ కలగలి గ్రామంలో యువకులు బలన్నిరూపణ చేస్తారు. గ్రామ కూడలి వద్ద ఉన్న రాతితో కూడిన గుండ్రాయిని భూమి నుండి పైకెత్తి భుజము పైకి తీసుకొని వెనుకాళ్ళ నుండి వేయడం కూడా ఇది ఒక బల నిరూపన కిందే వస్తుందని గ్రామస్తులు భావిస్తారు.
మంచి దేహదారులు కలిగిన యువకులు గుండ్రాయిని లేపి భుజంపై ఎత్తుకొని వెనకాల పడేయడంతో గ్రామస్తులు ఆ యువకున్ని సన్మానించడం జరుగుతుంది. ఇలా గ్రామీణ ప్రాంతాలలో పూర్వికుల నుండి వస్తున్న ఆచారంగా భావిస్తారు. ఇలా పండుగ వాతావరణంలో ప్రశాంతంగా హోలీ పండుగను జరుపుకున్నారు. ఆనందోత్సవాలతో హోలీ పండుగ ఘనంగా నిర్వహించుకున్నారు.



