- Advertisement -
– రంగుల్లో మునిగితేలిన చిన్నారులు
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఆయా గ్రామాల్లో మంగళవారం హోలీ పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి. గ్రామాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా చిన్నారులు, మహిళలు, యువకులు హోలీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, రంగులు పూసుకుంటూ సంబరాలు చేసుకున్నారు. చిన్నారులు రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. కమ్మర్ పల్లి లో సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, హాస కొత్తూర్ లో నలిమేల రేవతి గంగారెడ్డి గ్రామ యువకులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అనిల్ రెడ్డి యువత కలిసి హోలీ సంబరాలు చేసుకున్నారు. మండలంలోని ప్రజాప్రతినిధులు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.


- Advertisement -



