Tuesday, March 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వన్య ప్రాణుల సంరక్షణ ప్రతి మనిషి బాధ్యత

వన్య ప్రాణుల సంరక్షణ ప్రతి మనిషి బాధ్యత

- Advertisement -

గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
విద్యార్థుల సమక్షంలో వన్యప్రాణుల దినోత్సవం : ఎఫ్ డి ఓ చంద్రశేఖర్ 
నవతెలంగాణ – అచ్చంపేట
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్  ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణ వాటిపై మన బాధ్యత అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎఫ్ డి ఓ  చంద్రశేఖర్ మాట్లాడారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రతి మనిషి బాధ్యత అని వివరించారు వన్యప్రాణుల ప్రాముఖ్యత వన్యప్రాణుల సంరక్షణ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా జంగల్ సఫారీ కి తీసుకెళ్లి అడవి పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.

కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పలు విద్యా మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. మనుషులు మరియు ప్రకృతి మధ్య సఖ్యతను సూచిస్తూ ప్రత్యేక హోలీ వేడుకను నిర్వహించారు. ఈ రంగుల పండుగను పర్యావరణ హిత పద్ధతిలో జరుపుతూ ఐక్యత, ఆనందం మరియు పర్యావరణ బాధ్యత అనే సందేశాలను వ్యాప్తి చేశారు. వన్యప్రాణి సంరక్షణ – వాటిని కాపాడడంలో మన పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించబడింది. విద్యార్థులు అడవులను సంరక్షించడం, అంతరించిపోతున్న జాతులను రక్షించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం మరియు పర్యావరణ హానిని నివారించడం వంటి అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటిని ఆదా చేయడం, చెట్లు నాటడం, చెట్లు  సంరక్షణ గురించి వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -