నవతెలంగాణ – సారంగాపూర్
హోలీ.. చిన్నా పెద్దలు తమ తమ వయస్కులతో సంబరంగా జరుపుకునే గొప్ప పండగ… చెడుపై మంచి విజయాన్ని సూచించే పండగ అని కూడా చెప్పుకుంటారు.సాంస్కృతిక ప్రాముఖ్యత గల ఈ రంగుల పండగ శీతాకాలం ముగింపు, వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఒకరికొకరు రంగులు చల్లుకోవడం వల్ల పాత విభేదాలు దూరమై ఐక్యత ఆనందం పెరుగుతాయని భావిస్తూ పండుగను సంబరంగా జరుపుకుంటారు.. ఈ పండగ వచ్చిందంటే చాలు.. అనువైన వారం ఉండాలే గాని… ఇక తగ్గేదేలే అన్నట్టుగా… దావత్ లే..
దావతులు… ఇదిలా ఉండగా సారంగాపూర్ మండల కేంద్రం తో పాటు గ్రామాలలో హోలీ… అదే రంగుల పున్నమును ఘనంగా జరుపుకున్నారు.. పిల్లలు పెద్దలు మహిళలు అన్ని వర్గాల వారు వరుసకు రక్తసంబంధీకులు కాని వారందరిపై రంగులు చల్లుకుంటూ… ఆనందోత్సవాల మధ్య నిర్వహించుకున్నారు..చిన్న పెద్దల మధ్య బేధాలు లేకుండా కలిసికట్టుగా పండుగ జరుపుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.



