విదేశీ పర్యటనకు ఏడాదికి 34 ఉచిత విమాన టికెట్లు
పర్వతాలు, సీపీఐ(ఎం) ఎం నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ – అచ్చంపేట
మెంబర్ అఫ్ పార్లమెంట్ (ఎంపీ) భారత పార్లమెంట్లో ప్రజల ప్రతినిధి. లోక్సభ సభ్యులు ప్రజలచే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా ప్రజలు ఎన్నుకుంటారు. వీరు చట్టాల రూపకల్పన, పార్లమెంట్ నిజకవర్గ అభివృద్ధి, ప్రభుత్వ నిధుల నిర్వహణ, జాతీయ సమస్యలపై పార్లమెంట్లో చర్చించడం వంటి కీలక విధులు నిర్వహిస్తారు. వీరి పదవీకాలం 5 ఏళ్ళు ఉంటుంది. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా పాఠకులు, గ్రామీణ ప్రాంత ప్రజల అవగాహన కోసం ఈ కథనం ఇవ్వడం జరుగుతుంది.
దేశంలో 543 మంది లోక్ సభ ఎంపీలు ఉన్నారు. ఒక్కొక్క పార్లమెంటు సభ్యునికి నెలకు రూ.1 లక్ష 24.వేలు గౌరవ వేతనం తీసికుంటారు. మళ్ళీ నియోజకవర్గ భత్యం పేరుతో అదనంగా నెలకు రూ.70వేలు, కార్యాలయ నిర్వహణ ఖర్చులకు రూ.60 వేలు పార్లమెంటు సమావేశాల సమయంలో రూ. 2,500 రోజువారీ భత్యం పొందుతారు. ఎంపీకి ప్రయోజనాలు సౌకర్యాలు దేశ రాజధాని ఢిల్లీలో అద్దె లేకుండా వసతి భవనం ఉంటుంది. త్రాగునీరు, కరెంటు ఉచితంగా ఉంటుంది.
టెలిఫోన్, ఇంటర్నెట్ ఫ్రీ పార్లమెంటు సభ్యులు కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామికి సంవత్సరానికి 34 ఉచిత విదేశీ ప్రయాణ టికెట్లు ఉంటాయి. అదే విధంగా రైలు ప్రయాణంలో ఫస్ట్ క్లాస్ లో ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
ఎంపీ ల్యాండ్ సంవత్సరానికి రూ.5 కోట్లు
తను గెలుపొందిన లోక్ సభ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసం ఎంపీ ల్యాండ్స్ కింద సంవత్సరానికి రూ. 5 కోట్లు కేటాయిస్తారు. ఉచిత వైద్యం కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద ఎంపీకి ఆయన కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సౌకర్యం ఉంటుంది. మాజీ పార్లమెంట్ సభ్యులకు ప్రతి నెల పింఛన్ సౌకర్యం ఉంటుంది.
ఎమ్మెల్యేల గౌరవ వేతనం
తెలంగాణ రాష్ట్రంలో 119 (శాసనసభ్యులు) ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నియోజకవర్గం అలవెన్స్ రూ.2 లక్షల 30.వేలు, గౌరవ వేతనం రూ.20వేలు మొత్తం నెలకు రూ.2 లక్షల 50 వేలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న రోజులలో రోజువారీగా రూ. 1000 నుంచి రూ. 1500 తీసుకుంటున్నారు. నియోజకవర్గ కేంద్రంలో ఉచిత వసతి, ఇంటర్నెట్ త్రాగు నీరు, విద్యుత్తు ఉచితంగా ప్రభుత్వం కల్పిస్తుంది. మాజీ ఎమ్మెల్యేలకు ప్రతినెల పింఛన్ సౌకర్యం కూడా ఉంటుంది. భారతదేశంలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలే అధికంగా జీతాలు తీసుకుంటున్నారని సమాచారం.
ఎంపీ, ఎమ్మెల్యేలకు లక్షలలో జీతాలు అవసరం లేదు: వర్ధం పర్వతాలు, సీపీఐ(ఎం) ఎం నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి
పార్లమెంటు సభ్యులకు, శాసనసభ సభ్యులకు ప్రతినెల లక్షలలో గౌరవ వేతనాలు అవసరం లేదు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎంపీలకు, శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలకు రోజువారి భత్యం ఇస్తే సరిపోతుంది. ఎంపీ, ఎమ్మెల్యేల గౌరవ వేతనాల చట్టాన్ని సవరించాలి.



