నవతెలంగాణ – బజార్హత్నూర్
మండల కేంద్రంలో సాంప్రదాయంగా వస్తున్న కుస్తీ పోటీలు మంగళవారం హోరాహోరిన సాగాయి. మొదట పిల్లలతో కొబ్బరికాయతో ప్రారంభమైన కుస్తీ పోటీలు స్థాయిని బట్టి రూ.10 నుంచి రూ.5000 వరకు పోటీలు నిర్వహించారు. రాష్ట్ర,అంతరాష్ట్ర మల్లయోధులతో హోరాహోరి నా ముగిసింది. ఈ కుస్తీ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి నాందేడ్, యవత్మల్, అవురంగబాద్, అమరావతి, కిన్వాట్, మహూర్ తదితర జిల్లాల నుండి మల్లయోధులు పాల్గొన్నారు.
ప్రస్తుతం పరిస్థితుల్లో యువత, క్రికెట్, తదితర క్రీడల పట్ల మోజు చూపుతున్నప్పటికీ గ్రామీణ ప్రజలు మాత్రం ఈ కుస్తీ పోటీల పట్ల మోజును వీడడం లేదు. ఈ పోటీలను వీక్షించడానికి చిన్న, పెద్ద మహిళలు అనే తారతమ్యం లేకుండా భారీ ఎత్తున తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు సైతం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పరచ సాయన్న, గ్రామస్తులు డుబ్బుల చంద్ర శేఖర్, చట్ల వినీల్ తదితరులు పాల్గొన్నారు.



