Wednesday, March 4, 2026
E-PAPER
Homeజిల్లాలునిత్యం లారీల రద్దీ.. రోడ్డంతా దుమ్మూ ధూళీ

నిత్యం లారీల రద్దీ.. రోడ్డంతా దుమ్మూ ధూళీ

- Advertisement -

తాడిచెర్ల-కొయ్యుర్ రోడ్డుపై బైఠాయించిన ప్రజలు
నవతెలంగాణ – మల్హర్ రావు

తాడిచెర్ల-కొయ్యుర్ ప్రధాన రోడ్డుపై నిత్యం అడ్డూ అదుపు లేకుండా బొగ్గు లారీలు రాత్రింబవళ్ళు నడవడంతో ఇండ్లపై దుమ్ము, ధూళి చేరుతోంది. అంతే కాకుండా ప్రధాన రహదారి ధ్వంసమై గుంతలమయంగా మరిందంటూ మల్లారం, రావుపల్లి గ్రామాల ప్రజలు మంగళవారం రోడ్డుపై బైఠాయించి, ఆందోళన, నిరసన చేపట్టారు.

నాలుగు గంటల పాటు లారీలు రోడ్డుపై నిలవడంతో ట్రాఫిక్ జమై ప్రయాణికులు ఇబ్బందులకు గురైయ్యారు. బొగ్గు లారీలు పరిమితికి మించి బొగ్గు రవాణా చేయడంతో రోడ్డు ముక్కలై రోడ్డుపై ప్రయాణం చేయాలంటే నరకయాతన అనుభవిస్తున్నామని ప్రజలు వాపోతున్నారు. పరిమితికి మించి బొగ్గు రవాణా చేస్తున్న లారిలపై చర్యలు తీసుకోవాల్సిన ఆర్అండ్ బి అధికారులు అమ్యామ్యాలకు తలొగ్గి ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు మండిపడ్డారు.

ఇప్పటికైనా సంబంధించిన ఉన్నతాధికారులు రోడ్డు నిర్మాణం చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా బొగ్గు రవాణా చేస్తున్న లారీలని సీజ్ చేయాలని, దుమ్ము, దూళి రాకుండా ఎప్పటికప్పుడూ జెన్కో అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే లారీలను నిత్యం అడ్డుకోవడం జరుగుతుంది ప్రజలు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -